English | Telugu
తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్ కుమార్తె క్లీంకార!
Updated : Jun 20, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార ఈ రోజు (జూన్ 20) రెండో పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా, ఆమె జీవితంలో మెమరబుల్ మూమెంట్ చోటుచేసుకుంది. (Klin Kaara)
గత సంవత్సరం హైదరాబాద్ జూ పార్క్‌కు వెళ్లిన సమయంలో రామ్ చరణ్, ఉపాసన, చిన్నారి క్లీంకార ఒక తెల్ల బెంగాల్ పులి పిల్లను చూశారు. ఆ ప్రత్యేక క్షణాన్ని గుర్తుగా ఉంచుతూ.. జూ అధికారులు ఆ పులి పిల్లకి 'క్లీంకార' అనే పేరు పెట్టారు.
ఈ రోజు తన రెండో పుట్టినరోజు సందర్భంగా, క్లీంకార మొదటిసారిగా తన పేరును కలిగి ఉన్న తెల్ల పులిని ప్రత్యక్షంగా చూసింది. అంతేకాదు.. జంతువుల పట్ల సహానుభూతి, ప్రేమను ఎప్పుడూ చూపిస్తూ ఉండే రామ్ చరణ్, ఉపాసన ఈరోజు అధికారికంగా ఆ పులిని దత్తత తీసుకున్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఉపాసన.. క్లీంకారను పట్టుకొని పులి ఎదురుగా కూర్చొని దిగిన ఫొటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.