English | Telugu

తెలుగు దర్శకులు ఇలా.. తమిళ దర్శకులు అలా.. యే క్యా హై!

ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల రూపొందించిన 'కుబేర' చిత్రం తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా ధనుష్ పోషించిన దేవ పాత్రను శేఖర్ కమ్ముల మలిచిన తీరు, ఆ పాత్రలో ధనుష్ ఒదిగిపోయిన తీరు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఓ వైపు తెలుగు దర్శకులు.. మంచి కథలు, పాత్రలతో తమిళ హీరోలకు గుర్తుండిపోయే సినిమాలను అందిస్తుంటే... మరోవైపు తమిళ దర్శకులు మాత్రం తెలుగు హీరోలకు డిజాస్టర్స్ అందిస్తున్నారనే చర్చ నడుస్తోంది.

గత కొన్నేళ్లలో తెలుగు హీరోలతో తమిళ దర్శకులు చేసిన 'స్పైడర్', 'ది వారియర్‌', 'కస్టడీ', 'గేమ్ ఛేంజర్' ఇలా పలు సినిమాలు పరాజయం పాలయ్యాయి. మరోవైపు తమిళ హీరోలతో తెలుగు దర్శకులు చేసిన 'సార్', 'కుబేర' వంటి సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయి. దీంతో మన దర్శకులు మన హీరోలతోనే ఇలాంటి మంచి సినిమాలు చేయొచ్చు కదా అని తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఈ విషయంలో మన హీరోలనే తప్పుబడుతున్నారు. మన హీరోలు కంటెంట్ ఉన్న సినిమాలు కంటే.. ఎక్కువగా రెగ్యులర్ యాక్షన్ సినిమాలు, భారీ సినిమాలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.

నిజానికి 'సార్', 'లక్కీ భాస్కర్' కథలను కొందరు తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నమాట. ఇక 'కుబేర'లో ధనుష్ పోషించిన బిచ్చగాడు పాత్ర చేయడానికి మన హీరోలు ఎంతవరకు సిద్ధమనేది సందేహమే. అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోరు.. ఒకవేళ ఒప్పుకున్నా స్టార్డం పేరుతో కొన్ని సీన్స్ కి అభ్యంతరం తెలిపే అవకాశముంది. అందుకే ఇటువంటి కథలు.. ఇతర భాషల హీరోలను వెతుక్కుంటూ వెళ్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే తెలుగు హీరోలతో తమిళ దర్శకులు చేస్తున్న సినిమాల పరాజయాల విషయంలో కూడా.. కేవలం ఆ దర్శకులనే నిందించలేము. మన హీరోలు ఆ కథలను అంగీకరిస్తేనే కదా అవి పట్టాలెక్కేది. వైవిధ్యంగా ఉన్న కథలు, పాత్రలు ఎంచుకుంటే.. ఆటోమేటిక్ గా మంచి సినిమాలు వస్తాయి. ఒక్కోసారి కమర్షియల్ గా రిజల్ట్ ఎలా ఉన్నా.. నటుడిగా పేరు వచ్చే అవకాశముంది. అందుకే మన తెలుగు హీరోలు ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. మరి ఈ సినిమాతోనైనా తమిళ దర్శకుల నెగటివ్ సెంటిమెంట్ కి బ్రేక్ పడుతుందేమో చూడాలి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.