English | Telugu
రజనీ పిరికొడు కాదు..కెప్టెన్‌పై రజనీ ఫ్యాన్స్ ఆగ్రహం..!
Updated : Apr 17, 2016
వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై విజయ్ కాంత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ నాయకులు భయపెడితే భయపడ్డానికి తాను రజనీకాంత్ మాదిరిగా పిరికివాడిని కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సూపర్ స్టార్ అభిమానులకు ఆగ్రహన్ని కలిగించాయి. పలుచోట్ల విజయ్‌కాంత్ దిష్టిబొమ్మను వారు దగ్థం చేశారు. ఉత్తర చెన్నైలోని కొడుంగయ్యూరులో గల మీనంబల్ నగర్లోను కెప్టెన్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. రజనీకాంత్ కావాలనుకుంటే ప్రధానమంత్రి కూడా కాగలరని, అంతటి ప్రజాభిమానాన్ని రజనీకాంత్ పొందుతున్నారని అలాంటి వ్యక్తిపట్ల విజయ్ కాంత్ నోరు పారేసుకోవడం సరికాదని, ప్రచారం కోసం సూపర్ స్టార్‌ను వాడుకోవద్దని హెచ్చరించారు.