English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ కారు నెంబర్ తెలుసా..!
Updated : Apr 17, 2016
జూనియర్ ఎన్టీఆర్..నందమూరి వంశంలో మూడో తరం హీరో. అచ్చుగుద్దినట్టు అన్నగారిని పోలి ఉండే జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, సాంగ్స్ ఇలా మల్టీ టాలెంటెడ్ కాబట్టే అభిమానుల్లో ఇంత క్రేజ్. రీసెంట్‌గా ఆయన చేసిన నాన్నకు ప్రేమతో ద్వారా స్టైలిష్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి పండగ చేసిన ఆయన ప్రజంట్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఎన్టీఆర్‌కి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్ ఫాలో అవుతారు...ఆయన పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తారు. ఎన్టీఆర్‌కు ఎన్నో కార్లు ఉన్నాయి. లేటేస్ట్‌గా ఆయన మరో బీఎండబ్ల్యూ కొన్నారు. దానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెట్టారు ఎన్టీఆర్. దాని విలువ అక్షరాల 10.50 లక్షలు. ఈ నంబర్ కోసం నిన్న ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో జూనియర్‌తో పాటు మరో ముగ్గురు పోటీపడ్డారని రవాణా శాఖ తెలిపింది. అయినా వారందరిని వెనక్కినెట్టి ఎన్టీఆర్ దక్కించుకున్న ఆ నెంబర్ ఇదే..టీఎస్ 09 ఈఎల్ 9999.