English | Telugu

63లో కూడా ఆదరగొట్టేస్తున్నాడు

ఎప్పుడు సింపుల్ గా ఉండటం, దైవ భక్తి ఎక్కువ, ప్రేక్షక అభిమానుల కోసం ఆరు పదుల వయసులో కూడా తన నటనతో అలరిస్తున్న ఏకైక నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈరోజుతో రజినీకి 63ఏళ్ళు నిండాయి. తెలుగు, తమిళ, హిందీ బాషల్లోనే కాకుండా ఆయనంటే ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. "తలైవా" అంటూ ఆయనను ప్రేమగా పిలుస్తారు.ఈ వయసులో కూడా తను చేసే చిన్న చిన్న స్టైల్స్ కి వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నారు అంటే నమ్మకతప్పదు. ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా రాజకీయం అనే బురదలోకి దిగకుండా, తన వంతు బాధ్యతను కేవలం సినిమా ద్వారానే తన అభిమానులకు అందజేస్తున్నాడు.

తమిళనాడులో ప్రతి సంవత్సరం ఈరోజున ఒక పండగ వాతావరణంగా మారుతుంది. రజినీ అభిమానులు ఎదో ఒక విధంగా వారి అభిమానాన్ని చాటుతూనే ఉంటారు. రజని నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టవడమే కాకుండా.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇటీవలే రజని నటించిన "రోబో" చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

ప్రస్తుతం రజినీ హీరోగా "కొచ్చడయాన్" అనే చిత్రం రూపొందుతుంది. సౌందర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రం కోసం రజినీ అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.

రజినీ ఇలాగే మరిన్ని సినిమాలు చేస్తూ, అభిమానులను అలరించాలని కోరుకుంటూ... పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.కామ్