English | Telugu
ఇండియన్ 2 ని దాటేసిన ధనుష్ రాయన్.. ఫ్యాన్స్ సంబరాలు
Updated : Aug 8, 2024
తనని తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఎందుకు అభివర్ణిస్తారో ధనుష్(dhanush)తన లేటెస్ట్ మూవీ రాయన్(raayan)తో మరోసారి చాటి చెప్పాడు. రిలీజ్ రోజు నుంచే పాన్ ఇండియా లెవల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రాయన్ ఇప్పడు తమిళనాట సరికొత్త రికార్డుని నెలకొల్పింది. దీంతో ధనుష్ అభిమానులు ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు.
తమిళనాట ఈ ఏడాది విడుదలైన అన్ని సినిమాల కంటే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రాయన్ నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఇటీవల విడుదలైన కమల్(kamal haasan)శంకర్(shankar)ల ఇండియన్ 2(indian 2)మీద ఉంది. ఇండియన్ 2 81 కోట్లు వసూలు చెయ్యగా రాయన్ 82 .25 కోట్లని సాధించింది. అదే విధంగా ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే రాయన్ ఇప్పటికే 130 కోట్లని సాధించింది.ఎంటైర్ ధనుష్ కెరీర్ లోనే ఫస్ట్ వీక్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగాను నిలిచింది
ఇక రాయన్ లేటెస్ట్ గా ఆస్కార్ లైబ్రరీ లో శాశ్వతంగా చోటు సంపాదించుకుంది. అత్యున్నతమైన స్క్రీన్ ప్లే ని పండించినందుకు రాయన్ కి అంతటి గౌరవం దక్కింది. ధనుష్ తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, దుష్ర విజయన్, అపర్ణ బాలమురళి, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఇక రాయన్ కి రచనా దర్శకత్వ బాధ్యతల్ని కూడా ధనుష్ అందించిన విషయం తెలిసిందే.