English | Telugu
ఘనంగా చైతన్య, శోభితా నిశ్చితార్థం.. సంతోషంలో నాగార్జున!
Updated : Aug 8, 2024
నాగ చైతన్య (Naga Chaitanya), శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) పెళ్లి వార్తలు నిజమయ్యాయి. చైతన్య, శోభితా నిశ్చితార్థం తాజాగా జరిగింది. ఈరోజు(ఆగష్టు 8) ఉదయం 9 గంటల 42 నిమిషాలకు తన కుమారుడు నాగ చైతన్య, శోభితా నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు. ఎంగేజ్ మెంట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. చైతన్య-శోభితా జంట జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగార్జున ఆశీర్వదించారు.