English | Telugu

ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రేపు(ఆగష్టు 9న) లాంచ్ కానుంది. ప్రశాంత్ నీల్ ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం.. పైగా 'కేజీఎఫ్', 'సలార్' తర్వాత డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా, ఆ ఈవెంట్ ని లైవ్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లాంచ్ విషయంలో ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ మూవీ లాంచ్ అంటే హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవెంట్ ని ఘనంగా జరుపుతారు. ఎందరో సినీ ప్రముఖులు అతిథులుగా హాజరవుతారు. మొత్తానికి ఓ పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కి మాత్రం ఎటువంటి సందడి లేదట. రామానాయుడు స్టూడియోలో లో సింపుల్ గా ప్రైవేట్ ఈవెంట్ లా జరుపుతారట. మీడియా కవరేజ్ కూడా లేదని తెలుస్తోంది. ఈవెంట్ ముగిశాక, లాంచ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను మేకర్స్ విడుదల చేస్తారని సమాచారం. ఎన్టీఆర్ లాంటి బడా స్టార్ మూవీ లాంచ్ ఇంత సింపుల్ గా జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'దేవర' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వార్ 2' షూటింగ్ దశలో ఉంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 'వార్ 2'తో పాటు పారలల్ గా షూటింగ్ జరుపుకోనుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.