English | Telugu

వ‌ర్మ క‌రీంన‌గ‌ర్ లో ఏం చేయ‌బోతున్నాడు?

వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ప‌దేళ్ల త‌ర‌వాత రావ‌ల్సిన ఆలోచ‌న‌.. ఆయ‌న‌కు నిన్న సాయంత్ర‌మే వచ్చేస్తుంది. ప్ర‌తీదీ క్రియేటివిటీతో కూడిన క‌మ‌ర్షియాలిటీతో ఆలోచిస్తారాయ‌న‌. ఇప్పుడు ఆయన‌కు మ‌రో ఆలోచ‌న వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోనో, చెన్నైలోనో ఇండ్ర‌స్ట్రీ ఉండాలా..?? క‌రీంన‌గ‌ర్‌లో ఉండ‌కూడ‌దా?? అని. అందుకే ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌లో ఓ ఇండ్ర‌స్ట్రీ పెట్టేస్తున్నారు. న‌వంబ‌రు 18న క‌రీంన‌గ‌ర్‌లోని శాత‌వాహ‌న యూనివ‌ర్సీటిలో ఓ అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించ‌బోతున్నాడ‌ట‌. ఈ స‌ద‌స్సులో ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చ‌ని వ‌ర్మ చెబుతున్నాడు. ''ఇండ్ర‌స్ట్రీ హైద‌రాబాద్‌లోనో, వైజాగ్‌లోనే ఉండిపోవాల‌నుకోవ‌డం మూర్ఖ‌త్వంతో కూడిన అవివేకం. ప్ర‌పంచం ఇప్పుడు గ్లోబ‌ల్ విలేజ్ అయిపోతోంది. ఎవ‌రైనా ఎక్క‌డైనా సినిమా తీసుకోవ‌చ్చు'' అని చెబుతున్నాడు వ‌ర్మ‌. మ‌రి క‌రీంన‌గ‌ర్‌లో వ‌ర్మ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.