English | Telugu
సంపూ లక్ తిరిగిందిరోయ్...
Updated : Nov 15, 2014
బర్నింగ్‌స్టార్ సంపూ బాబు.. ఒకే ఒక్క పోస్టర్‌తో ఆన్‌లైన్‌లో స్టార్ అయిపోయాడు. హృదయకాలేయం అంటూ గిలిగింతలు పెట్టాడు. కరెంటు తీగ సినిమాలో చిన్న స్పెషల్ ఎప్పీరియన్స్ ఇస్తే.... థియేటర్లో గోల గోల. మంచు విష్ణు సంపూ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. సింగం 123 అంటూ.... సంపూ ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ డ్రస్సులో కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ క్రేజ్ ఎంత వరకూ వెళ్లిందంటే.. రాంగోపాల్ వర్మ సంపూతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. రాంగోపాల్ వర్మ - సంపూ సినిమా అంటే ఇండ్రస్ట్రీలో తప్పకుండా హాట్ టాపిక్కే. సంపూతో మనీ లాంటి సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఆల్రెడీ ఓ లైన్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోనూ సంపూ పోలీస్ ఆఫీసరే అని తేలింది. మొత్తానికి సంపూ లక్ తిరగబడినట్టే.