English | Telugu
పవన్ డబ్బులు పెట్టలేదట
Updated : Nov 15, 2014
సాయిధరమ్ తేజ్ కెరీర్ వెనుక ఉన్నదెవరు..?? వరుసగా అవకాశాల మీద అవకాశాలు చేజిక్కించుకోవడానికి కారణమేంటి?? పవన్ కల్యాణ్ అండదండలు ఈ యువ హీరోపై ఉన్నాయా, సాయి కెరీర్‌కి కర్త, కర్మ, క్రియ మొత్తం.. పవనేనా? సాయి సినిమాలకు వెనుక నుంచి డబ్బులు పెడుతున్నాడా? ఇలాంటి ఎన్నో సందేహాలున్నాయి. వాటిపై సాయిధరమ్ తేజ్ స్పందించాడు. ''చిరు మావయ్య, పవన్ నాగబాబు మావయ్యల ఆశీస్సులు నాకున్నాయి. అంతే తప్ప... పవన్ మావయ్య డబ్బులు పెట్టడం అనేది నిజం కాదు. ఆయన నా సినిమాలకు ఎందుకు డబ్బులు పెడతారండీ...?? కాకపోతే వాళ్ల ఆశీస్సులు, అండదండలు నాకున్నాయి. అది చాలు..'' అని క్లారిటీ ఇచ్చాడు. చిరు కుటుంబం మొత్తం 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాని వీక్షించారట. అయితే పవన్ మాత్రం ఇంకా చూడలేదట ''కల్యాణ్ మావయ్య త్వరలోనే నా సినిమా చూస్తానన్నారు. ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నా'' అంటున్నాడు సాయిధరమ్‌తేజ్.