English | Telugu

జపాన్‌లో పుష్ప మేనియా.. టోక్యోలో అడుగుపెట్టిన అల్లు అర్జున్!

జనవరి 16న జపాన్‌లో విడుద‌ల‌వుతోన్న ‘పుష్ప 2 ది రూల్‌’
కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టోక్యో వెళ్ళిన అల్లు అర్జున్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, భారత సినీ పరిశ్రమను షేక్‌ చేసిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’(Pushpa 2 The Rule). ఇప్పుడీ చిత్రం జపాన్‌లో సంద‌డి చేయ‌నుంది. విడుదలైన రోజు నుంచే ఓ సెన్సేష‌న‌ల్‌గా మారిన ఈ సినిమా ఇండియ‌న్ సినీ బాక్సాపీస్ ద‌గ్గ‌ర తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాలో జ‌పాన్‌కు సంబంధించి ఓ స్పెష‌ల్ రిఫరెన్స్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. పుష్ప ఎంట్రీ ఫైట్ సీన్ జ‌పాన్ నేప‌థ్యంలో సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ స్వ‌యంగా జ‌ప‌నీస్‌లో డైలాగ్స్ చెప్ప‌టం ప్రేక్ష‌కులను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ ఎలిమెంట్స్ ఇప్పుడు జ‌పాన్ ప్రేక్ష‌కుల్లో పుష్ప 2పై మ‌రింత ఆస‌క్తిని పెంచ‌నున్నాయి.

పుప్ప 2 సినిమాను జ‌పాన్‌లో ‘పుష్ప కున్రిన్’గా జనవరి 16న విడుదల చేస్తున్నారు. సందర్భంగా అల్లు అర్జున్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టోక్యో చేరుకున్నారు. త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అంద‌మైన న‌గ‌రం ఉన్న ఫొటోను తీసి పోస్ట్ చేశారు. దీనికి సింపుల్‌గా టోక్యో అనే క్యాప్ష‌న్ పెట్టారు.

Also Read: మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ రివ్యూ

గీక్ పిక్చ‌ర్స్‌, షోచికు సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి పుష్ప మ్యాడ్‌నెస్‌ను జ‌పాన్ సిల్వ‌ర్ స్క్రీన్స్ మీద‌కు తీసుకు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే జ‌పాన్ ప్రేక్ష‌కుల‌కు ఇండియ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ చూపారు. ఈ నేప‌థ్యంలో పుష్ప కున్రిన్ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని నిర్మాత‌లు న‌మ్మ‌కంగా ఉన్నారు.

సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌. ఇందులో ఫహాద్‌ ఫాజిల్‌ పోలీస్‌ అధికారిగా కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించారు.