English | Telugu
నా పిల్లల ఫోటోలు బయటకి వస్తే కాళికాదేవి నాకు ఆవహిస్తుంది
Updated : May 14, 2025
ప్రముఖ హీరోయిన్ ప్రీతిజింటా(Preity zinta)తన సినీ కెరీర్ ని మణిరత్నం, షారుక్ ఖాన్(Shah Rukh Khan)కాంబినేషన్ లో వచ్చిన 'దిల్ సే' మూవీతో ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్, మహేష్ లతో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించింది. బాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించిన ప్రీతి జింటా ఎన్నో అవార్డుల్ని కూడా గెలుచుకుని తన సత్తా చాటింది. ముఖ్యంగా 'కల్ హో నాహో' లో ఆమె ప్రదర్శించిన నటన చూస్తే కళ్ళ నీళ్లు పెట్టని వారు ఉండరు.
రీసెంట్ గా ప్రీతి ఎక్స్(X)వేదికగా తన పర్సనల్ విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది. ఆమె మాట్లాడుతు కెరీర్ ప్రారంభించినప్పుడు ఎప్పుడు ఆర్ధికంగా స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాను. నా బ్యూటీ సీక్రెట్కి కారణం నా వారసత్వమే. ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు ఎక్కువ సేపు నిద్రపోతాను. ముఖ్యంగా పాజిటివ్ గా ఉండటం వల్ల అందంగా కనిపిస్తాం. మహాకుంభమేళా కి వెళ్లే మూడువారాల ముందు శాకాహారిగా మారిపోయి ఇంతవరకు నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు. ఫోన్ వాడటం తగ్గించి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. నా అనుమతి లేకుండా ఎవరైనా నా పిల్లల ఫోటోలు తీస్తే నాలో ఉన్న కాళికాదేవి బయటకి వస్తుంది.
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)గురించి బాలీవుడ్(Bollywood)నుంచి ఎవరు స్పందించకపోవడం గురించి నేనేం మాట్లాడలేను. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. సైనిక నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అలాంటి విషయాలు వింటే చలించిపోతాను. అందుకే నేను ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పుకొచ్చింది. ప్రీతి జింటా ప్రస్తుతం లాహోర్ 1947 అనే మూవీ చేస్తుండగా సదరు చిత్రం షూటింగ్ దశలో ఉంది.