English | Telugu

చావా తరహాలోనే మరో చారిత్రాత్మక మూవీ తెలుగులో రిలీజ్..భారతీయుల ప్రాణాలకి విలువ లేదా!

'ఛత్రపతి శంభాజీ మహారాజ్'(Shambhaji Maharaj)జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'చావా'(Chhaava)హిందీలో ఘన విజయం సాధించడంతో పాటు తెలుగులోకి కూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మేకర్స్ కేవలం తెలుగులోకి మాత్రమే డబ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకి బాలీవుడ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు 'చావా' కోవలోనే 'కేసరి చాప్టర్ 2'(Kesari Chapter 2)మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ ఈ నెల 23 న రిలీజ్ కాబోతుంది. ఏషియన్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తెలుగునాట అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనుంది. హిస్టారికల్ కోర్ట్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన 'కేసరిచాప్టర్ 2 హిందీ వెర్షన్ ఏప్రిల్ 18 న రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే, రెజినా కసాండ్రా, తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించాడు. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టీవ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

1919 వ సంవత్సరంలో భారతదేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచిన 'జలియన్ వాలాబాగ్' సంఘటన నేపథ్యంలో 'కేసరి చాప్టర్ 2 ' తెరకెక్కింది. ఈ సంఘటనలో బ్రిటిష్ వాళ్ళు జరిపిన కాల్పుల్లో వెయ్యిమందికి పైగా మరణించగా, రెండు వేల మందికి పైగా గాయపడ్డారు. అక్షయ్ కుమార్(Akshay Kumar)బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే అడ్వకేట్ సర్ శంకరన్ నాయర్ క్యారక్టర్ ని పోషించగా, జలియన్ వాలా బాగ్ మారణకాండకు కారణమైన జనరల్ డయ్యర్ పై కేసు వేస్తాడు. యువ న్యాయవాది దిల్‌రీత్ గిల్ ఈ కేసుకి సంబంధించి నాయర్ కి తోడుగా ఉంటాడు. ఈ కేసులో నాయర్ విజయాన్ని సాధించాడా లేదా అనేదే ఈ చిత్ర కథ.



అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.