English | Telugu
పత్యూష నటనకు ఫిదా అయ్యింది... తాను చనిపోయింది
Updated : Apr 8, 2016
చిన్నారి పెళ్లికూతురు ద్వారా దేశంలోని ఎందరో ప్రేక్షకులకు దగ్గరైన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాయ్‌పూర్‌కు చెందిన మధు మహానంద్ అనే మహిళకి చిన్నారి పెళ్లికూతరు సీరియల్ అంటే చాలా ఇష్టం డైలీ ఎక్కడ ఉన్నా సీరియల్ మాత్రం మిస్సవ్వదు.అందులో ప్రత్యూష నటనకు మధు ఫిదా అయ్యింది. అయితే ఒకరోజు ప్రత్యూష చనిపోయినట్టు టీవీలో చూసింది. అంతే ఆమె షాక్‌కి గురైంది, ప్రత్యూష లేని లోకంలో తాను జీవించలేనని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మ అలా ఎందుకు చేస్తుందో అర్థం కాని ఆమె రెండేళ్ల కొడుకు ఏడవటం ప్రారంభించాడు. ఈ ఏడుపు విన్న చుట్టుపక్కల వారు గమనించి చూడగా ఆమె ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఆమె భర్తను విచారించగా,ప్రత్యూష చనిపోయినప్పటి నుంచి మధు అదోలా ఉంటుందని, ఉరి వేసుకుంటే ఎలా ఉంటుందని తనను అడిగిందని చెప్పాడు.