English | Telugu

త్వరలో గబ్బర్ సింగ్ 3.. టైటిల్ రాజా సర్దార్ గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్‌ తెరకెక్కింది. మొదటి సినిమాకి స్టోరీ ప్రకారం ఇది సీక్కెల్ కాకపోయినా, స్టోరీలో థీమ్ మాత్రం ఒక్కటే. ఎక్కడైనా అన్యాయాలను ఎదిరించడమే గబ్బర్ సింగ్ క్యారెక్టర్. అదే స్టోరీ-స్క్రీన్ ప్లే రాసుకుని సర్దార్ చేశాడు పవన్. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ ది ఎండ్ పడుతుండగా చివర్లో రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ నేమ్ కార్డ్ వేసి సినిమాని క్లోజ్ చేశారు. ఈ ఒక్క రీజన్‌తో గబ్బర్ సింగ్-3 వచ్చేస్తుందని చిన్న పిల్లాడు కూడా చెప్పేస్తాడు. రీసెంట్‌గా సర్దార్ ప్రమోషన్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా గబ్బర్ సింగ్ 3కి వస్తుందని సంకేతాలు ఇచ్చేశాడు. ఈ కేరక్టర్‌ని ఫ్యూచర్‌లో ఎవరైనా కొనసాగించినా.. అదో ట్రంప్ కార్డుగా ఉండాలనే ఉద్దేశంతోనే గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ అదే మ్యూజిక్‌తో చేసినట్లు తెలిపాడు. వీటినన్నింటినీ పరిశీలిస్తే.. పవన్ తను సినిమాల నుంచి రిటైర్ అయ్యేలోపే ‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ తెరకెక్కించడం ఖాయమని తెలుస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.