English | Telugu
హ్యాపీ బర్త్‌డే టూ స్టైలిష్ స్టార్
Updated : Apr 8, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..ఈ పేరు ట్రెండ్‌కి కేరాఫ్ అడ్రస్, మెగా ఫ్యామిలీ టాలీవుడ్‌కి అందించిన గిఫ్ట్ . ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. మెగాస్టార్ సినిమాలో బాలనటుడిగా నటించిన బన్నీ, గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ లవర్‌బాయ్‌గా మొదలు పెట్టి, యాక్షన్, సస్పెన్స్ చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం సరైనోడు షూటింగ్‌లో బిజిగా ఉన్న అల్లు అర్జున్ కెరిర్‌పై ఒక లుక్కేద్దాం.
1. గంగోత్రి :
ఇండస్ట్రీకి ఎంతోమంది స్టార్‌లను ఇంట్రడ్యూస్ చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి చేతుల మీదుగా హీరోగా లాంచింగ్. ఇన్నోసెంట్ లుక్స్, భయం భయంగా నటనలో ఓనమాలు దిద్దుకున్న క్లాసికల్
2. ఆర్య :
ఈ మూవీతో తనకంటూ ఒక గుర్తింపు, స్టైల్ ప్రెజెంట్ చేసుకున్నాడు బన్నీ. స్టార్ హీరో పెర్ఫామెన్స్ ఇచ్చి అటు ఆడియన్స్ ని, విమర్శకులను మెప్పించాడు.
3. బన్నీ :
పూర్తి కమర్షియల్ టచ్. ఈ సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ ని, యూత్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలను అని నిరూపించాడు. సినిమా భారాన్ని మొత్తం తానే మోసే స్థాయికి వెళ్ళాడు.
4.పరుగు :
లవ్, రిలేషన్, పేరెంట్స్ ఎలిమెంట్స్‌తో అర్జున్‌ని నటుడిగా ఎవరెస్ట్ ఎక్కించిన సినిమా. బన్నీ సెంటిమెంట్‌ను ట్రై చేయగలడని ప్రూవ్ చేసిన సినిమా
5.దేశముదురు :
టాలీవుడ్‌లో సిక్స్ ప్యాక్ ట్రై చేసిన ఫస్ట్ హీరో, ఫస్ట్ మూవీ డిఫరెంట్ గెటప్, పంచ్ డైలాగ్‌లతో బన్నీ ఎనర్జీని బయటకు తెచ్చిన మూవీ.
6. వేదం :
అల్లు అర్జున్ ఫస్ట్ మల్టీస్టారర్, నార్మల్, నెగిటివ్ షేడ్స్, హీరోయిజాన్ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసిన మూవీ
7. జులాయి :
త్రివిక్రమ్ తరహాలో ఒక స్టైల్ రాబరీ బేస్డ్ మీద సాగుతూ సస్పెన్స్, క్రైమ్, లవ్ కాంభినేషన్‌లో బన్నీ మార్క్ ఎంటర్‌టైనర్
8. రేసు గుర్రం :
బన్నీ ని అన్ని విధాలా హైలైట్ చేసిన సినిమా . కామెడీ, యాక్షన్ జోనర్‌లో కెరిర్‌లోనే కలెక్షన్ల వర్షం కురిపించాడు అల్లు అర్జున్
9. సన్నాఫ్ సత్యమూర్తి :
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సెకండ్ టైమ్ వర్క్ చేసిన మూవీ. మల్టీమిలియనీర్ కొడుకుగా, మిడిల్ క్లాస్ యువకుడిగా డబుల్ రోల్ పోషించాడు అల్లుఅర్జున్.