English | Telugu
'కాఫీ విత్ కరణ్' షోలో విజయ్ దేవరకొండ.. వైరల్ అయిన మగ్!
Updated : May 30, 2022
బాలీవుడ్ నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్ తన పాపులర్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7 షూటింగ్‌ను మొదలుపెట్టేశాడు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లను షూట్ చేసిన ఆయన కొంతమంది అనూహ్యమైన సెలబ్రిటీలను మన ముందుకు తీసుకురాబోతున్నాడు. వారిలో టాలీవుడ్ సంచలన హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు!
'లైగర్'లో హీరోయిన్‌గా నటిస్తోన్న అనన్య పాండేతో కలిసి ఒక ఎగ్జయిటింగ్ ఎపిసోడ్‌ను పూర్తి చేశాడు విజయ్. ఈ ఎపిసోడ్ విజయ్, కరణ్ మధ్య ఆసక్తికరమైన సంభాషణను ప్రెజెంట్ చేయనున్నది. 'లైగర్'తో బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న విజయ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన గాసిప్స్, స్టోరీస్‌ను కూడా ఆడియెన్స్ తెలుసుకోనున్నారు. నిన్న ముంబైలోని వై.ఆర్.ఎఫ్. స్టూడియోస్‌లో జరిగిన ఈ షో షూటింగ్‌లో డైరెక్టర్ పూరి జగన్నాథ్, సహ నిర్మాత చార్మి కౌర్ కూడా పాల్గొన్నారు.
కాగా, ఈ ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా విజయ్ దేవరకొండ సంతకం చేసిన ఫేమస్ 'కాఫీ విత్ కరణ్' మగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయో తెలుసుకోవాలని ఆడియెన్స్ కుతూహలం వ్యక్తం చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' ఆగస్ట్ 25న తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్నది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అనన్యా పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రోణిత్ రాయ్, రమ్యకృష్ణ మరో రెండు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.