English | Telugu

సమంతా, సిద్దూ మరియు దీప

ముచ్చటగా మూడే మూడు సినిమాలతో టాప్ హీరోయిన్ల లిస్టులో జేరిపోయిన సమంత తెలుగు సినిమాలలో ఇంకా నిలద్రొక్కుకొనేందుకు తిప్పలు పడుతున్న హీరో సిద్దార్దకి పడిపోవడం విశేషమే. నేడో రేపో వారిరువురు పెళ్లి పీటలు కూడా ఎక్కుతారని అందరూ భావిస్తుంటే అకస్మాత్తుగా సమంతా లవర్ బాయ్ సిద్దార్దకి కటీఫ్ చెప్పేసింది. అందుకు కారణం అతను వేరే కుర్ర హీరోయిన్ కి లైన్ వేస్తుండటమే.

అతను చిక్ మగుళూరుకు చెందిన దీపా సన్నిధి అనే ఇరవై నాలుగేళ్ల హీరోయిన్ తో కలిసి ‘ఎనక్కుల్ వరువాన్’ అనే సినిమాలో నటిస్తున్నప్పుడు వారివురి మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయిపోవడంతో సిద్దార్థ ఆమె చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ సంగతి తెలుసుకొన్న సమంత మళ్ళీ ఆతనిని సంజాయిషీ కూడా కోరకుండానే మీడియా ముందుకు వచ్చి ‘నేను సిద్దూతో కటీఫ్ చేసుకొంటున్నా’ని ప్రకటించేసింది. అది విని సిద్ధూ ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు చాలా ప్రయత్నించినా ఆమె మనసు కరుగలేదు. పాపం సిద్ధూ అనుకోవాలో లేకపోతే పాపం సమంతా అనుకోవాలో?