English | Telugu
'పిల్లా నువ్వులేని జీవితం' ట్వీట్ రివ్యూ
Updated : Nov 14, 2014
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే తన రెండో సినిమా 'పిల్లా నువ్వులేని జీవితం'తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. ఈ సినిమా ప్రదర్శించబోతున్న థియేటర్ల వద్ద మెగా సందడి ఉదయం నుంచే మొదలైంది. ఫుల్ జోష్‌లో వున్నారు మెగా అభిమానులు. ఇప్పటికే రిలీజైన ట్రెయిలర్స్‌లో డాన్సుల్లో సత్తాచాటిన సాయి, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ వంటి విభాగాల్లో ఎలా చేశాడన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని వుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి తెలుగువన్ మీ కోసం తీసుకొని వస్తోంది. ఫస్ట్ షో లైవ్ అప్ డేట్స్..!
'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా మొదలైంది. మెగా ఫ్యాన్స్ విజిల్స్ తో థియేటర్ లో సందడి చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ మరియు షాయాజీ షిండే ఎంట్రీ ఇచ్చారు. సినిమా సీరియస్ మోడ్ లో ప్రారంభమైంది.
'జగపతిబాబు' మైసమ్మ గా మంచి మాస్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు.
'దిల్ సే దిల్ సె దిల్ సె' బోలో అంటూ సాయిధరమ్ తేజ వెండితెరపై తన మొదటి ఎంట్రీ కూల్ గా ఇచ్చాడు. థియేటర్ మొత్తం గోల గోల..!
జగపతిబాబు, సాయి ధర్మ తేజ కామెడీ సీన్స్ నడుస్తున్నాయి. జయప్రకాష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
'పిల్లా నువ్వులేని జీవితం' కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ లోకి షిఫ్ట్ అయ్యింది. అందాల ఎనర్జిటిక్ హీరోయిన్ రెజీనా ఎంట్రీ ఇచ్చింది. టైం ఫర్ ది బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్.
సాయిధర్మతేజ, రెజీనా మధ్య టీజింగ్ సన్నివేశాలు బాగున్నాయి.
జయప్రకాష్ రెడ్డి తన ట్రేడ్ మార్క్ కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నారు.
సినిమాలో చిన్న ట్విస్ట్...ఇంటర్వెల్ కి టైమైనట్టుంది..!!
సూపర్ ఇంటర్వెల్ బ్యాంగ్... టైం ఫర్ ది ఛాయ్ బ్రేక్...:)
ఛాయ్ బ్రేక్ తరువాత సినిమా తిరిగి మొదలైంది.
సూపర్ హిట్ టైటిల్ సాంగ్ 'పిల్లా నువ్వులేని జీవితం' మొదలైంది. తేజ డాన్స్ సూపర్బ్..!
రాఘుబాబు కామెడీ సన్నివేశాలతో ఆడియన్స్ బాగా అలరిస్తున్నాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' లో ఆసక్తికరమైన మలుపు..!!
సినిమా చాలా ఆసక్తికర౦గా నడుస్తోంది. యాక్షన్ సీన్స్ లో సాయిధర్మతేజ తన టాలెంట్ చూపిస్తున్నాడు. అనూప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
'పిల్లా నువ్వులేని జీవితం' లో మరో ఆసక్తికర మలుపు.. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
ప్రకాష్ రాజ్ మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఇంట్రస్టింగ్ గా ముందుకు సాగుతోంది.
సూపర్బ్ హిలేరియస్ పొలిటికల్ క్లైమాక్స్ .. 'పిల్లా నువ్వులేని జీవితం' కంప్లీట్ రివ్యూ కోసం వీక్షిస్తూ ఉండండి తెలుగువన్.