English | Telugu
పవన్ పక్కన హీరోయిన్ ఫిక్సయ్యింది
Updated : Nov 14, 2014
పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గబ్బర్ సింగ్ 2 గురించి సరికొత్త సంగతులు ఇవీ. ఈ సినిమాడిసెంబరులో ప్రారంభం కానుందని చిత్రబృందం ధృవీకరించింది. కథానాయికగా అనీషా అంబ్రోస్‌ని ఎంచుకొన్నారు. ఒడిస్సాకు చెందిన ఈ మోడల్.. ఇది వరకు అలియాస్ జానకిలో నటించింది. పవర్ రూపొందించిన బాబిని దర్శకుడిగా కన్‌ఫామ్ చేశారు. 2015 మేలో ఈ సినిమాని విడుదల చేస్తారట. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కి బెర్తు ఖాయమైంది. ఇది గబ్బర్ సింగ్‌కి సీక్వెల్, ప్రీక్వెల్ కాదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. బాలీవుడ్ సినిమా దబాంగ్‌కీ ఎలాంటి సంబంధం ఉండదట. ఈకథని ఎన్నికలకు ముందే... పవన్ రాసుకొన్నాడని, ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అంతేకాదు.. గబ్బర సింగ్ అంత్యాక్షరిలో సందడి చేసిన బ్యాచ్ ఈ సినిమాలోనూ కనిపించనుంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా రాజేశ్ మోరే; ఇన్ ఛార్జ్ ఆఫ్ ప్రి-విజువలైజేషన్ గా భాను మోరే బాధ్యతలు నిర్వహిస్తూండగా, పవన్ కు సన్నిహితుడైన డాన్స్ కొరియోగ్రాఫర్ హరీశ్ పాయ్ ఈ చిత్రానికి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. కిశోర్, బృందం రచనలో పాలుపంచుకుంటున్నారు. "డిసెంబర్ లో మొదలయ్యే ఈ చిత్రం వేసవి కానుకగా వచ్చే సంవత్సరం మేలో విడుదల కానుంది" అని నిర్మాత శరత్ మరార్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఎరాస్ ఇంటర్నేషనల్స్ తో కలసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు నిర్మించనున్నాయి.