English | Telugu

'పిల్లా నువ్వులేని జీవితం' పెద్దలకు మాత్రమే

మెగా మేనల్లుడు సాయిధర్మతేజ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న చిత్రం 'పిల్లా నువ్వులేని జీవితం'. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల14న విడుదలకు సిద్దమవుతోంది. సెన్సార్ వారు ఈ సినిమాకి 'A' సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ చిత్రంలోని కొన్ని ఫైటింగ్ సీక్వెల్స్‌ లో హింసాత్మాక దృశ్యాలుగా ఎక్కువగా వుండడం వల్ల 'A' సర్టిఫికేట్ ను ఇచ్చారు.సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.