English | Telugu

లైలా రాబట్టిన కలెక్షన్లు

నాగచైతన్య, పూజా హెగ్డె జంటగా నటించిన 'ఒక లైలా కోసం' మూవీ కలెక్షన్లు క్లోజింగ్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మొదటి షో నుంచి యావరేజ్ టాక్ టో మొదలైన ఈ సినిమాకి పండగ సెలవులు బాగా కలిసివచ్చాయి. మొదటి వారంలోనే 70 శాతం కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ట్రేడ్ వర్గాలు భావించినట్లుగానే 15కోట్లతో ముగించబోతుంది. ఇండస్ర్టీ ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ వివరాలిలా వున్నాయి.

నైజాం రూ.3.80 కోట్లు
సీడెడ్ రూ.1.50 కోట్లు
నెల్లూరు రూ.0.39 కోట్లు
కృష్ణా రూ.0.62 కోట్లు
గుంటూరు రూ.0.91 కోట్లు
వైజాగ్ రూ.1.40 కోట్లు
తూర్పు గోదావరి రూ.0.65 కోట్లు
పశ్చిమ గోదావరి రూ.0.52 కోట్లు

తెలంగాణ + ఏపీ కలిపి రూ.9.79 కోట్లు

కర్ణాటక రూ.1.15 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.0.35 కోట్లు
ఓవర్సీస్ రూ.0.95 కోట్లు
వాల్డ్ వైడ్ రూ.12.24 కోట్లు

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...