English | Telugu

ఫ్యాన్స్ ను తికమకపెడుతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు గందరగోళంలో వున్నారు. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత ఏ సినిమాలో నటించనున్నాడోనని తెలియక తికమక పడుతున్నారు. ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్న బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్2’ సినిమా చేయనున్నాడని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.అలాగే తాజాగా ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు తో పవన్ ఓ సినిమా చేయనున్నాడనే విషయం కూడా తెలిసిందే. దీంతో పవన్ ఇందులో మొదటగా ఏ సినిమాలో నటిస్తాడోనని అభిమానులు కంగారుపడుతున్నారు.ఇవే తికమకగా వుంటే... తాజాగా మరో వార్త పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. పవన్ సొంత బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’పై ‘సర్దార్’ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీంతో ఈ ‘సర్దార్’ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరి ఈ విషయాలపై పవన్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.