English | Telugu

చిరు క‌థ‌తో నారాయ‌ణ‌మూర్తి సినిమా??

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఇటీవ‌ల ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో ఓ పేరు రిజిస్ట‌ర్ చేయించారు. ఆ టైటిల్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అదేంటో తెలుసా...??? ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. ఈ పేరు విన‌గానే చింజీవి అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డ‌తారు. ఎందుకంటే చిరంజీవి 150వ సినిమాగురించి ఎప్పుడు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చినా ఈ టైటిల్ వినిపించేది. ఈ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి జీవితాన్ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చిరంజీవి కోసం స్ర్కిప్టుగా మ‌లిచారు. చిరంజీవి కూడా ఈ సినిమాని చేయాల‌ని ఉత్సాహం చూపించారు. ఆ త‌ర‌వాత ఎందుక‌నో ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు. చిరంజీవి పూర్తి వినోదాత్మ‌క చిత్రం వైపు దృష్టి మ‌ర‌ల్చ‌డంతో ఈ స్ర్కిప్టుని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు ఈ క‌థ‌తో ఆర్‌.నారాయ‌ణ మూర్తి ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఆయ‌న ఈ సినిమాని ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. మొత్తానికి చిరు టైటిల్ ఈ విధంగా ఉప‌యోగ‌ప‌డుతోంద‌న్న‌మాట‌.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...