English | Telugu
హాట్ టాపిక్: ఎన్టీఆర్ నిర్మాతపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు
Updated : Jan 12, 2016
ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్‌పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'అత్తారింటికి దారేది' టైమ్‌లో తలెత్తిన గొడవ, 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల టైమ్‌లో తెరపైకి రావడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టాలీవుడ్ లో అందరికీ అత్యంత సన్నిహితుడుగా పేర్కొనే నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్, నిర్మాతల హీరోగా పేరున్న పవన్ కళ్యాణ్ మధ్య వివాదం రావడం చర్చనీయాంశమయ్యింది.
అసలు ఏం జరిగిదంటే.. అత్తారింటికి దారేది సినిమా కంప్లీట్ తరువాత ప్రసాద్ రెండు కోట్ల మొత్తాన్ని పవన్ కు బాకీ పడ్డాడు. ఆ మొత్తాన్ని 'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ సమయంలో ఇస్తానని మాటిచ్చాడట. అయితే... నాన్నకు ప్రేమతో రేపు రిలీజ్ కాబోతున్నా తనకు ప్రసాద్ నుంచి ఎలాంటి సమాధానం కానీ డబ్బులు కానీ అందలేదని పవన్ 'మా' లో కంప్లయింట్ ఇచ్చాడు. ఈ ఫిర్యాదును మా అసోసియేషన్ నిర్మాతల మండలికి పంపింది. అదీ సంగతి..!!