English | Telugu
'నాన్నకు ప్రేమతో' మేనియా మొదలైంది
Updated : Jan 12, 2016
రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా కూడా 'నాన్నకు ప్రేమతో' మేనియాతో ఊగిపోతున్నారు జనం. ఎన్టీఆర్ కు ఇది 25వ సినిమా కావడంతో 'ఎన్టీఆర్ 25' అని ముద్రించిన టీషర్టులతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు జనం. ఎన్టీఆర్ వేసిన కొత్త గెటప్ తో మాస్కులు తయారు చేసుకుంటున్నారు. ఇంకా అమ్మాయిలైతే హెన్నాతో ఎన్టీఆర్ పేరును చేతులపై ముద్రలు వేయించుకుంటున్నారు.కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి ప్రాంతాల్లో సైతం ఎన్టీఆర్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఓవర్సీస్ లో ‘నాన్నకు ప్రేమతో’ బెనిఫిట్ షోలకు కూడా అభిమానులు ఉత్సాహంగా తయారవుతున్నారు. ఎంత రేటైనా పెట్టి టికెట్లను కొనుక్కోవడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ కు మంచి సినిమా పడాలి, హైప్ రావాలే కానీ.. ఫ్యాన్స్ నుంచి ఎలా అభిమానం తన్నుకొస్తుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఇక ఈ సినిమా హిట్టైతే అభిమానులకు పండగే పండగ.