English | Telugu
నాన్నకు ప్రేమతో ప్రీ రివ్యూ రిపోర్ట్
Updated : Jan 12, 2016
ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సెన్సార్ పూర్తయింది. ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్ విండోల సర్వర్ డౌన్ అయిపొయింది. మూవీ రిలీజ్కి ముందే బోలెడంత హైప్ వచ్చింది. కంటెంట్ లో సంథింగ్ మ్యాటర్ ఉందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే టిక్కెట్ల కోసం కొట్లాట కూడా అదే రేంజులో ఉంది. ఇంతకీ సుకుమార్ ఏం చూపించాడు.. ఎన్టీఆర్ ఎలా చేశాడు.. అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందుకే నాన్నకు ప్రేమతో ఎలా వుండబోతుందని ఆరా తీసింది తెలుగువన్. మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాన్నకు ప్రేమతో ప్రీ రివ్యూ రిపోర్ట్ మీ కోసం:
స్పెయిన్‌లోని ధనవంతుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకడు. ఫ్యాక్టరీలూ, ఆస్తులు.. అపారమైన సంపద. తనకు ఇద్దరు కొడుకులు.. ఎన్టీఆర్, రాజీవ్ కనకాల. ఎన్టీఆర్‌కి నాన్నంటే ప్రాణం... తన జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తాడు. సడన్‌గా ఓరోజు రాజేంద్రప్రసాద్ ఆసుపత్రిపాలవుతాడు. డాక్టర్లు కూడా ఎంతోకాలం బతకడు.. అని చెప్పేస్తారు. దాంతో ఎన్టీఆర్‌కి షాక్. కళ్లముందున్న స్వప్నం కూలిపోతున్నట్టు కనిపిస్తుంది. మరో షాక్ ఏంటంటే... నాన్న పేరుమీదున్న కంపెనీలన్నీ దివాళా తీయడం.. సడన్‌గా.. ఆస్తుల స్థానంలో అప్పులు కనిపిస్తాయి. దానికి కారణం... కృష్ణమూర్తి. (జగపతిబాబు). రాజేంద్ర ప్రసాద్‌కి ఆప్త మిత్రుడిగా నటించి.. దారుణంగా మోసం చేస్తాడు జెబి. విషయం తెలుసుకొన్న ఎన్టీఆర్.. ఎలాగైనా సరే - కృష్ణమూర్తి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని తండ్రికి మాటిస్తాడు. అందులో భాగంగా కృష్ణమూర్తి కూతురు.. రకుల్‌ని ప్రేమలో పడేస్తాడు. రకుల్ సహాయంతో.. కృష్ణమూర్తి సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు. అక్కడ.. ఎన్టీఆర్ ఏం చేశాడు.? తన పగ ఎలా సాధించుకొన్నాడన్నదే కథ. ఎమోషన్స్ అంటే తెలియని మనిషిగా.. కేవలం మైండ్ గేమ్‌తోనే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే చాణిక్యుడిలా ఎన్టీఆర్ పాత్రని తీర్చిదిద్దాడట సుకుమార్.
ఎన్టీఆర్ పాత్ర చిత్రణే ఈ సినిమాకి అత్యంత పెద్ద హైలెట్ అని తెలుస్తోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరోలు చిత్రవిచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ పాత్ర అలానే డిజైన్ చేశాడట సుకుమార్. సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూ సీరియస్ అయిపోతాడట. ఎప్పుడో జరిగిన గొడవ గుర్తొచ్చి.. వాడ్ని వెదికి పట్టుకొని మరీ కొడతాడట. అలాంటి వెరైటీ సీన్లు ఈ సినిమా నిండా ఉన్నాయట.
* తండ్రీ కొడుకుల సెంటిమెంట్ అని చెబుతున్నా.. ఫాదర్‌తో సీన్లు కొన్నే ఉంటాయట. విలన్ పాత్రధారి జగపతిబాబుకీ - ఎన్టీఆర్‌కి మద్య నడిచే సన్నివేశాలు ఈ సినిమాకి మేజర్ హైలెట్.
* మైండ్ గేమ్ ఆధారంగా నడిచే సినిమా ఇది. మైండ్ గేమ్‌తో జగపతిబాబుని ఎన్టీఆర్ ఎదుర్కొనే సన్నివేశాలన్నీ బాగా వచ్చాయట.
* తాగుబోతు రమేష్ పాత్ర వెరైటీగా సాగుతుందని సమాచారం
* పతాక సన్నివేశాలకు అరగంట ముందు ఈ సినిమా ఓ రేంజులో ఉంటుందట. ఓ సీన్ దాదాపుగా 4 నిమిషాలకుపైగానే సాగుతుందట. అందులో ఎన్టీఆర్ ఎమోషనల్ డైలాగులు పలికే విధానం సింప్లీ సూపర్బ్ అని తెలుస్తోంది.
* యాక్షన్ ఎపిసోడ్‌ని తీర్చిదిద్దిన విధానం కూడా వెరైటీగా సాగిందని, ఓ ఫైట్‌లో ఎన్టీఆర్ డైలాగులు చెబుతూ.. రౌడీలనుకొట్టే సన్నివేశం బాగా టేకప్ చేశారని తెలుస్తోంది.
* ద్వితీయార్థం కాస్త డల్ అవ్వడం... ఒక్కటే కాస్త ఇబ్బంది పెట్టిందట. అలాగే ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా నచ్చుతుందని..మాస్ ని ఆకట్టుకుందా? లేదా? అనేది భయం చిత్ర యూనిట్ లో నెలకొని వుందట. మాస్ కూడా ఈ సినిమాకి ఓటు వేస్తే నాన్నకు ప్రేమతో ఈ సంక్రాంతి విజేతగా నిలవడం ఖాయమని అంటున్నారు.