English | Telugu

పవన్ రూట్ మార్చుకుంటాడా?

పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు టాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోలు. నటన, ఫాలోయింగ్‌ సంగతి పక్కనబెడితే త్రివిక్రమ్‌ ఓ ఇంటర్వ్యూ లో చెప్పినట్లు ఈ ఇద్దరిలో కొన్ని కామన్‌ పాయింట్స్‌ కనిపిస్తాయి. ఇద్దరూ చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు.. సింప్లిసిటీ కనిపిస్తుంది. మీడియాతో ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ కొంతకాలంగా మహేష్ బాబు ప్రమోషన్‌ ఎంత ముఖ్యమో గుర్తించి తన సినిమాల ప్రమోషన్‌కు సహకరిస్తున్నాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం మహేష్‌తో పని చేసిన విక్టరీ వెంకటేష్‌.. ప్రిన్స్‌ సహకారం గురించి గొప్పగా చెప్పాడు. ఐతే ఇప్పుడు వెంకీ.. పవన్‌ కళ్యాణ్‌తోనూ సినిమా చేశాడు. పవన్‌ కోసమే ఆగి మరీ ‘గోపాల గోపాల’ సినిమాను లేటుగా ఆరంభించిన వెంకీకి షూటింగ్‌ సమయంలోనూ కొన్నిసార్లు గోపాలుడి కోసం ఆగక తప్పలేదని టాక్‌. ఎలాగోలా సినిమా అయితే పూర్తయిపోయింది. విడుదలకు ఇక నెల రోజులు కూడా టైం లేదు. ఇక ప్రమోషన్‌ మొదలుపెట్టాలి. మరి మహేష్ బాబులా పవన్ కళ్యాణ్ కూడా సినిమా ప్రమోషన్‌ ప్రాముఖ్యతను గుర్తిస్తారా? ‘గోపాల గోపాల’ కోసం పవన్‌ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారా? తన రూటు మార్చుకుంటాడా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!!