English | Telugu

రజినీకాంత్ మళ్ళీ తాత కాబోతున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఓ శుభవార్త. సూపర్ స్టార్ రెండవ కూతురు సౌందర్య త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో మరోసారి తాత అయ్యేందుకు రజినీ సిద్దమవుతున్నాడన్నమాట. 2010లో బిజినెస్‌మేన్‌ రామ్ కుమార్‌తో సౌందర్య వివాహం జరిగింది. గతేడాది తండ్రితో ‘కొచ్చాడియన్’ సినిమాను తీసి డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఐతే, టెక్నికల్‌గా సినిమాకి పేరు వచ్చినా.. కలెక్షన్ల విషయంలో బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఈరోస్ సంస్థ డిజిటల్ ఇన్నోవేషన్‌ ప్రాజెక్ట్‌కి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. తమిళనాట ‘లింగా’ హిట్ కావటంతో ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్న రజినీ ఫ్యాన్స్ త్వరలోనే మరోసారి వేడుకల కోసం రెడీ అవుతున్నారు.