English | Telugu

ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రికార్డ్ సృష్టించింది

వెండితెర బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడిన కొన్ని చిత్రాలు బుల్లి తెరపై రికార్డులు సృష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. లేటెస్ట్ గా ఈ జాబితాలో చేరింది ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రభస. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించలేక బోల్తాపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని కైవ‌సం చేసుకున్న జెమిని టీవి వారు గత వారం బుల్లితెరపై ప్రదర్శిస్తే వూహించని విధంగా బుల్లితెర అభిమానులు దీనిని వీక్షించారట. దీంతో జెమిని టీవి ఏకంగా 14.5 రేటింగ్ తో మొదటి స్థానంలో నిలిచిందట. ఎన్టీఆర్ రభస దెబ్బకి నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రు పోగ్రాం, ఇటు ఈటీవీలో జ‌బ‌ర్‌ద‌స్త్ కార్యక్రమం వెనక్కి పడిపోయాయట. ఇదే స్పీడు మున్ముందూ కొన‌సాగితే జెమినికి ర‌భ‌స గిట్టుబాటు చేసిన‌ట్టే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.