English | Telugu
పవన్‌కి ఆపరేషన్ : సినిమాలకు దూరం??
Updated : Jan 8, 2015
పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్. గోపాల గోపాల తరవాత పవన్ సుదీర్ఘమైన విరామం తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ టాక్. పవన్ గత కొంతకాలంగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. గబ్బర్ సింగ్ నుంచీ మొదలైన ఈ నడుం నొప్పి ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. గోపాల గోపాల షూటింగ్ ఆలస్యం అవ్వడానికి కూడా పవన్ నడుంనొప్పే కారణం అని తెలుస్తోంది. ఇక ఈ నొప్పి నుంచి శాశ్వతమైన ఉపశమనం తీసుకోవాలని పవన్ భావిస్తున్నాడట. అందుకే.. త్వరలోనే ఆపరేషన్ చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకొంటున్నాడని టాలీవుడ్ టాక్. త్వరలోనే పవన్ అమెరికా వెళ్లి, అక్కడే ఆపరేషన్ జరిపించుకొని కొన్నాళ్లు అక్కడే విశ్రాంతి తీసుకొని, అప్పుడు మళ్లీ ఇండియాకు వస్తాడని, ఇక్కడికి వచ్చాక కొన్నాళ్లు డాక్టర్ల సలహాతో విశ్రాంతి తీసుకొని, అప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా అవుతాడని తెలుస్తోంది. ఆ లెక్కన కనీసం రెండు మూడు నెలలు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. గోపాల గోపాల, గబ్బర్ సింగ్ 2కి మధ్య వచ్చే విరామంతో ఆపరేషన్ చేయించుకొంటే బాగుంటుందని పవన్ భావిస్తున్నాడట. అయితే గబ్బర్ సింగ్ 2 ఒక షెడ్యూల్ పూర్తయ్యాక అప్పుడు అమెరికా వెళ్లే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందని సన్నిహితులు, చిత్ర నిర్మాతలు పవన్‌కి సలహాలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి పవన్ ఏ నిర్ణయం తీసుకొంటాడో? మొత్తానికి పవన్ ఆపరేషన్ వార్త మాత్రం ఖాయం.