English | Telugu
కళ్యాణ్ హిట్టు కొడతాడా.?
Updated : Jan 8, 2015
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టాలని కసిగా వున్న కళ్యాణ్ రామ్, కరెక్ట్ టైమ్ కోసం వేచిచుస్తున్నాడు. మొదట తన ‘పటాస్’ను జనవరి 9న పేల్చాలని డిసైడ్ అయ్యాడు. ఐతే సంక్రాంతికి ‘గోపాల గోపాల’, ‘ఐ’ సినిమాలు వస్తుండడంతో ఈ సినిమాలు ఎలా ఉన్నప్పటికీ వాటి మధ్య ‘పటాస్’ పేలాలంటే చాలా కష్టమే. అలాగే కళ్యాణ్ రామ్ హిట్ రెంజులో నిలవాలంటే రెండు వారాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటితే తప్ప మంచి హిట్టు లభించదు. దీంతో తన పటాస్ ను జనవరి 23కు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అలాగే కళ్యాణ్‌రామ్ ఈ చిత్రానికి తనకి ఉన్న లైఫ్ లైన్స్ అన్నీ వాడేస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ పాటని రీమిక్స్ చేసి పెట్టుకున్న కళ్యాణ్‌రామ్ బాబాయ్ పోస్టర్లని కూడా యూజ్ చేసాడు. కేవలం బాబాయ్‌ని మాత్రమే కాకుండా తన సోదరుడు ఎన్టీఆర్‌కి ఉన్న పాపులారిటీని కూడా క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందని, పాత్రల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎన్టీఆర్ వాయిస్ వాడారని లేటెస్ట్ న్యూస్. అస్త్రాలన్నీ వాడేసిన కళ్యాణ్‌కి ‘పటాస్’తో సక్సెస్ వచ్చేస్తుందో లేదో మరి.