English | Telugu

బ్ర‌హ్మోత్స‌వంలో మ‌హేష్ బీభ‌త్సం

స్టార్ హీరోతో సినిమా టేక‌ప్ చేయాలంటే అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. అటు ద‌ర్శ‌కుడికి, ఇటు నిర్మాత‌ల‌కూ ఉరుకులూ ప‌రుగులే. బాబుగారి ఇమేజ్‌కి అనుగుణంగా క‌థ‌ల్ని మార్చుకొంటూ ఉండాలి. ప్రొడ్యూస‌ర్లు భారీద‌నం కోసం డ‌బ్బులు గుమ్మ‌రిస్తుండాలి. ''అది మార్చు... ఇది మార్చు..'' అంటే ఇగోల‌కు పోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు రిపేర్లు చేస్తుండాలి. పాపం.. శ్రీ‌కాంత్ అడ్డాల కూడా ఇప్పుడు అదే ప‌నిలో ఉన్నాడు. శ్రీ‌కాంత్ అడ్డాల 4వ సినిమా మ‌హేష్‌తో ఫిక్స‌య్యింది. ఆ సినిమా పేరు 'బ్ర‌హ్మోత్స‌వం'. వ‌రుస‌గా రెండు కాజాలు తిని... నిరుత్సాహంలో ఉన్న మ‌హేష్ ఈసారి స్ర్కిప్టు విష‌యంలో ఎలాంటి పొర‌పాట్లు చేయ‌కూడ‌ద‌నుకొంటున్నాడు. అందుకే శ్రీ‌కాంత్ అడ్డాల బ్ర‌హ్మోత్స‌వం స్ర్కిప్టుని త‌న ఇమేజ్‌కి, అభిమానుల ఆశ‌ల‌కు, ప‌రిశ్ర‌మ అంచ‌నాల‌కూ స‌రిపోయే విధంగా ద‌గ్గ‌రుండి మార్చుకొంటున్నాడ‌ట‌. స్ర్కిప్టు విష‌యంలో బీభ‌త్సంగా క‌ల‌గ చేసుకొంటున్నాడ‌ని శ్రీ‌కాంత్ అడ్డాల కాస్త ఫీలైనా, ఇదంతా సినిమా మంచి కోస‌మే క‌దా అని స‌ర్ది చెప్పుకొంటున్నాడ‌ట‌. దానికి తోడు 'ముకుంద‌' హిట్ట‌యితే త‌న‌మాటే చెల్లుదును.యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోవ‌డంతో శ్రీ‌కాంత్ అడ్డాల కూడా కామ్ అయిపోయాడ‌ట‌. సో బ్ర‌హ్మోత్స‌వం స్ర్కిప్టులో మ‌హేష్ చేస్తున్న బీభ‌త్సమైన మార్పులు ఈ సినిమాకి ఎలాంటి ఫ‌లితాన్ని తీసుకొస్తాయో చూడాలి.