English | Telugu
షాకింగ్ న్యూస్: సినిమాలకి పవన్ గుడ్ బై..!
Updated : Jun 10, 2014
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్! పవర్ స్టార్ త్వరలో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కమిటైన చిత్రాలు ‘గబ్బర్ సింగ్-2', 'ఓ మై గాడ్' చిత్రాలు పూర్తి చేసి నటనకి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. జనసేన పార్టీని స్థాపించిన పవన్ తదుపరి ఎన్నికలకి తన పార్టీని సన్నద్దం చేయాలంటే తగిన సమయం వుండాలి కాబట్టి సినిమాల నుంచి త్వరగా తప్పుకోవాలని ఆలోచిస్తున్నాడట. గతంలో సినిమాలకు తన సమయంలో సగం కేటాయిస్తానని ప్రకటించిన విషయం తెల్సిందే. కాని తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పడమే మంచిది అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ నిర్ణయంతో ఆయన అభిమానుల్లో నిరాశ కలుగుతోంది. కాని పవన్ సమాజంలో మార్పు కోసం పోరాడుతున్నందుకు సంతోషంగా ఉంది అని అభిమానులు సంతోషంను వ్యక్తం చేస్తున్నారు. పవన్‌తో పాటు ఆయన పార్టీకి కూడా అండదండలు అందిస్తాం అంటూ పవన్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.