English | Telugu
రోజుకి కోటి రూపాయలు తీసుకొన్న పవన్
Updated : Jan 2, 2015
టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయకుడు ఎవరు...?? ఈ ప్రశ్న లేవనెత్తగానే మహేష్‌బాబు, పవన్ కల్యాణ్‌లు మన మదిలో మెదులుతారు. పవన్, మహేష్... ఇద్దరూ సూపర్ స్టార్లే. బాక్సాఫీసు దుమ్ము దులిపే రేంజున్న స్టార్లు. ఆల్ టైమ్ ఇండ్రస్ట్రీ రికార్డ్స్‌కి అర్థాలు చెప్పిన హీరోలు. ప్రస్తుతానికైతే బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. అందుకే వీళ్ల పారితోషికం కూడా చుక్కల్లోనే ఉంది. బ్రహ్మోత్సవం కోసం మహేష్ బాబు దాదాపు రూ.18 కోట్ల పారితోషికం అందుకొన్నాడని టాలీవుడ్ టాక్. ఇప్పుడు పవన్ పారితోషికంలో మరో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. రోజుకి కోటి రూపాయలు అందుకొని కనీ వినీ ఎరుగని చరిత్ర సృష్టించాడు. పవన్ నటించిన చిత్రం గోపాల గోపాల. ఈసినిమా కోసం పవన్ కేవలం 15 రోజుల కాల్షీట్లు కేటాయించాడు. అందుకోసం రూ.15 కోట్ల పారితోషికం అందుకొన్నాడట. అంటే రోజుకి రూ.కోటి రూపాయల పారితోషికం అన్నమాట. దక్షిణాదినే ఈ రేంజులో అందుకొన్న హీరో లేడు. మహేష్ రూ.18 కోట్లు అందుకొన్నా.. కనీసం ఆ సినిమా కోసం రెండు నెలల పాటు కష్టపడాల్సిందే. ఒక్కోసారి మూడు నెలలూ పట్టొచ్చు. అంటే పారితోషికం విషయంలో మహేష్ కంటే అందనంత రేంజులో ఉన్నాడన్నమాట పవన్. గోపాల గోపాలకు 15 రోజుల కాల్షీట్లు ఇచ్చిన పవన్.. అదనంగా మరో 3 రోజులు వాడుకోమన్నాడట. అయితే గోపాల గోపాల టీమ్ మాత్రం 15 కాల్షీట్లతోనే సర్దుబాటు చేసుకోవడం విశేషం.