English | Telugu

బాబాయ్ - అబ్బాయ్‌... ఇక ఇంతేనా??

నంద‌మూరి బాల‌కృష్ణ - ఎన్టీఆర్ ల‌మ‌ధ్య జ‌రుగుతున్న ప్ర‌చ్ఛ‌న్న యుద్దం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వీరిద్ద‌రూ క‌లుసుకొంటే చూడాల‌ని ముచ్చ‌ట‌ప‌డిన నంద‌మూరి అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. 2015.. తొలి రోజున బాల‌య్య‌, ఎన్టీఆర్‌లు ఒకే వేదిక‌పైకి వ‌స్తార‌ని, వీరిద్ద‌రినీ ప‌టాస్ ఆడియో వేడుక క‌ప‌ల‌బోతోంద‌ని అభిమానులు ఆశించారు. అంద‌రూ అనుకొన్న‌ట్టే జ‌న‌వ‌రి 1న ప‌టాస్ ఆడియో వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. కానీ నంద‌మూరి బాల‌కృష్ణ మాత్రం రాలేదు. ప‌టాస్ ఆడియో వేడుక‌కు ర‌మ్మ‌ని క‌ల్యాణ్ రామ్ బాల‌య్య‌ని స్వ‌యంగా ఆహ్వానించాడ‌ట‌. అయితే బాల‌య్య మాత్రం సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దాంతో బాబాయ్‌, అబ్బాయ్‌ల‌ను క‌ల‌సి చూసే అవ‌కాశం అభిమానుల‌కు ద‌క్క‌కుండా పోయింది. ఒక‌వేళ బాల‌కృష్ణ ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చుంటే.. ఎన్టీఆర్ త‌ప్ప‌కుండా హ్యాండిచ్చేవాడ‌ని టాలీవుడ్ టాక్‌. మ‌రి బాబాయ్ అబ్బాయ్‌ల‌ను జంట‌గా ఎప్పుడు చూస్తామో, ఏంటో..??