English | Telugu
'దేవుడు' నుంచి లీకైన పవన్ లుక్!
Updated : Feb 26, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నారు. ఆరు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆగష్టు11న విడుదల చేయాలనుకోవడంతో షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది. పవన్ ఈ చిత్రానికి కేవలం 20 నుంచి 25 రోజుల డేట్స్ మాత్రమే కేటాయించారట. ముందుగా ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి ఆ తర్వాత మిగతా సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాదులోనే జరుగుతోంది. సెట్స్ నుంచి వర్కింగ్ స్టిల్స్ లీకయ్యాయి. రెడ్ కలర్ టీషర్ట్ ధరించిన పవన్ కళ్యాణ్ కారుపై స్టైల్ గా కూర్చుని ఉన్నారు. ఎదురుగా సాయి ధరంతేజ్ ఉన్నారు. వీరిద్దరికీ దర్శకుడు సముద్రఖని సీన్ ని వివరిస్తున్నారు. పవన్ లుక్ ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూసి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొదట దేవర, భగవంతుడు అనే టైటిల్స్ అనుకున్నారు. అయితే దేవుడు అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని భావించారు. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భగవంతుడిగా కనిపించనున్నారు. దేవుడుగా పవన్, మానవుడుగా సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఓ సందేశం ఉంటుంది. తమిళంలో వినోదయ సిత్తం మంచి విజయం సాధించింది. తమిళ వెర్షన్ కి కూడా సముద్రఖనినే దర్శకత్వం వహించారు. ఆయన చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కి దర్శకుడు సమూల మార్పులు చేశారట. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు ఓ సరికొత్త పవన్ ని దర్శకుడు ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి పవన్ పారితోషికం ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయేలా చేసింది. 20 రోజులుగాను ఏకంగా 80 కోట్లు తీసుకుంటున్నారట.
ఇక పవన్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు సాయిధరమ్‌తేజ్ బైక్ ప్రమాదం తర్వాత 'విరూపాక్ష' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొత్తానికి దేవుడు చిత్రం ద్వారా సాయిధరమ్ తేజ్ తొలిసారిగా తన చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషంగా చెప్పాలి.