English | Telugu
అక్టోబర్ నుంచి 'గబ్బర్ సింగ్ 2'..!
Updated : Aug 14, 2014
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు శుభవార్త. గత కొంత కాలంగా పవన్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 'గబ్బర్ సింగ్ 2' షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆరు నూరైనా 'గబ్బర్ సింగ్ 2' షూటింగ్ ను అక్టోబర్ నుంచి మొదలుపెట్టాలని పవన్ నిర్ణయించాడట. ఈ సినిమాకి దర్శకత్వం కూడా సంపత్ నందినే చేస్తున్నాడట. కొద్ది రోజుల క్రితం సంపత్ నంది స్థానంలో హరీష్ శంకర్ ను దర్శకుడిగా పెట్టారని వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్ కి మాత్రం ఈ సినిమా దర్శకుడిని మార్చలన్న ఆలోచనే లేదట. ఈ రూమర్ ఎవరు ముందు పుట్టించారు అన్నది ఆరా తీస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల'చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వెంకటేష్, పవన్ కల్యాణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.