English | Telugu

ఎన్టీఆర్ vs అల్లు అర్జున్.. ఈ సారి ఉత్తమ నటుడు ఎవరు!


-రసవత్తరంగా మారిన అవార్డ్స్
-ఎన్టీఆర్, అల్లు అర్జున్ లిస్ట్ లో ఉన్నారు
-యాంటీ ఫ్యాన్స్ రెడీ అయ్యిందా!
-నిజమైన ఫ్యాన్స్ ఏమంటున్నారు

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)..నూనూగు మీసాల వయసులోనే సెల్యులాయిడ్ పై సరికొత్త రికార్డులని సృష్టించిన బాక్స్ ఆఫీస్ మొనగాళ్లు. ఆ రికార్డు స్థాయిని పెంచుకోవాలని ఎప్పటికప్పుడు తమని తాము సరికొత్తగా డిజైన్ చేసుకుంటున్న నిత్య సినీ కృషి వలులు కూడా. అభిమాన ఘనానికి అయితే లెక్కేలేదు. సదరు లెక్క అంతకంత పెరగడమే కానీ తగ్గడం అనేది ఆ ఇద్దరి సినీ డిక్షనరీలో లేదు. రీసెంట్ గా ఈ ఇద్దరు సినీ సర్కిల్స్ ,అభిమానుల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

ఫిలింఫేర్ అవార్డ్స్.. సౌత్ సినీ పరిశ్రమకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ లో అత్యంత ప్రతిభ కనపరిచే వాళ్ళకి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్. సదరు అవార్డుని అందుకోవాలని సౌత్ సినీ పరిశ్రమకి చెందిన అందరు ఎంతగానో ఆశపడతారు. 70 సంవత్సరాల నుంచి సదరు అవార్డుల కార్యక్రమం జరుగుతుండటమే అందుకు నిదర్శనం. 2026 వ సంవత్సరానికి గాను తెలుగు పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడి కేటగిరిలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ ప్రీవియస్ చిత్రాలు దేవర, పుష్ప పార్ట్ 2 తో పోటీపడుతున్నారు. ఈ ఇద్దరితో పాటు సదరు కేటగిరిలో తెలుగు నుంచే నాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జ, సిద్దు జొన్నల గడ్డ 2024 లో రిలీజైన తమ చిత్రాల ద్వారా పోటీలో నిలబడ్డారు.


Also read:యూఫోరియా పై మహేష్ బాబు రివ్యూ.. ధురంధర్ ని మించి అందుకుంటుందా!

కానీ ప్రధాన పోటీ ఎన్టీఆర్,అల్లు అర్జున్ మధ్య ఉండే అవకాశం ఉందనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల ముసుగులో కొంత మంది సినీ విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని ఫుల్ యాక్టింగ్ తో స్వచ్ఛమైన అభిమానుల మధ్య గొడవలు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్లకి తెలియంది ఏంటంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఆఫ్ ది స్క్రీన్ బావ,బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ విషయం స్వచ్ఛమైన అభిమానులకి తెలుసు కాబట్టి ఎవరికొచ్చినా హ్యాపీ గా ఫీలవుతారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా సేమ్ మెంటాలిటీ తోనే ఉంటారని తెలిసిందే. ఫిబ్రవరి 21 న అవార్డు వేడుక జరగనుంది.