English | Telugu

యూఫోరియా పై మహేష్ బాబు రివ్యూ.. ధురంధర్ ని మించి అందుకుంటుందా! 

-నచ్చిన సినిమాని ప్రశంసించడం మహేష్ అలవాటు
-మరి యూఫోరియా పై ఏమంటున్నారు
-ధురంధర్ బ్యూటీ రిప్లై ఏంటి!


క్రియేటివ్ దర్శకుడు 'గుణశేఖర్'(Gunasekhar)కి సినీ మేకింగ్ పై ఉన్న ప్రొటెన్షాలిటీ గురించి తెలిసిందే. కథకి తగ్గ టేకింగ్ గుణశేఖర్ స్పెషాలిటీ. కొంత గ్యాప్ తర్వాత ఈ నెల 6 న డ్రామా, సోషల్ థ్రిల్లర్ 'యూఫోరియా'తో సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యాడు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని దక్కించుకోగా గుణశేఖర్ తో పాటు నటీనటుల పెర్ ఫార్మెన్స్ కి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా సబ్జెట్ కి అందరు ఇంప్రెస్ అవుతున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)యూఫోరియా(Euphoria)గురించి ట్వీట్ చేయడం జరిగింది. సదరు ట్వీట్ లో ఏముందో చూద్దాం.


మహేష్ బాబు ఎక్స్ వేదికగా స్పందిస్తు 'గుణశేఖర్ గారికి తన కథల్ని ప్రెజెంట్ చేయడంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుంది. ‘యుఫోరియా’ని ఎంజాయ్‌ చేశా. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. అందరు తప్పక చూడండి. గుణశేఖర్ గారికి అభినందనలు. భూమికతో సహా మొత్తం టీంకి కంగ్రాట్స్‌'' అని మహేష్ ట్వీట్ చేసాడు. వారణాసి(Varanasi)తో ఎంతో బిజీగా ఉండి కూడా 'యుఫోరియా'చూసి టీం ని అభినందించడం మహేష్ కి ఉన్న సినీ కమిట్ మెంట్ కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలోను పలు చిత్రాలని వీక్షించిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. మహేష్, గుణశేఖర్ కాంబోలో ఒక్కడు,అర్జున్, సైనికుడు వంటి చిత్రాలు రాగా ఒక్కడు లో మహేష్ కి భూమిక జత కట్టి హిట్ పెయిర్ అనిపించుకుంది.

Also read:25 ఏళ్లుగా ఆ కోరిక తీరలేదంటున్న శ్రీమతి శ్రీయ.. షాక్ లో ఫ్యాన్స్

మహేష్ బాబు ట్వీట్ పై యుఫోరియా హీరోయిన్ సారా అర్జున్(sara Arjun)ఎక్స్ వేదికగా స్పందిస్తు సూపర్ స్టార్ నుంచి వచ్చిన ప్రశంస తమకెంతో గర్వకారణం. మహేష్‌ కి ధన్యవాదాలు. 'వారణాసి' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. సారా అర్జున్ తన గత చిత్రం ధురంధర్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. మరి ధురంధర్ 2 తో అంతకు మించిన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.