English | Telugu

సితారతో నాని మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

వరుస సినిమాలతో బిజీగా ఉంటుంటాడు న్యాచురల్ స్టార్ నాని(Nani). ప్రస్తుతం 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్'(The Paradise ) చేస్తున్నాడు. ఆ తర్వాత సుజీత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో నాని ఒక మూవీ చేయనున్నాడని సమాచారం.

లవ్ స్టోరీలతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన వెంకీ అట్లూరి.. ఆ తరువాత రూట్ మార్చి 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి వైవిద్యభరితమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్యతో 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత నానితో వెంకీ అట్లూరి చేతులు కలబోతున్నట్లు వినికిడి.

'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాల విడుదల సమయంలోనే ఇలాంటి సినిమాలు నాని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేశారు. త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరేలా ఉంది. ఆ చిత్రాల తరహాలోనే ఓ వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

'రంగ్ దే' నుంచి వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సినిమాలన్నీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లోనే రూపొందుతున్నాయి. ఇప్పుడు నాని ప్రాజెక్ట్ కూడా సితార బ్యానర్ లోనే రూపొందనుందట. ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది అంటున్నారు.

Also Read: బాలయ్య బాటలో శ్రీవిష్ణు.. ఇంత రిస్క్ అవసరమా?