English | Telugu

ఓ రేంజ్ లో 'స్పై' టీజర్.. మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లోడింగ్!

'కార్తికేయ-2'తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పై కన్నేశాడు. నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకొని అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతోన్న 'స్పై' మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. 1945 లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారనే ప్రచారంలో వాస్తవం లేదని, ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటూ రూపొందించిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. 'స్పై'గా నిఖిల్ అదరగొట్టాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ మరో భారీ విజయాన్ని అందుకోబోతున్నాడు అనిపిస్తోంది.

కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కథ కూడా ఆయనే అందించడం విశేషం. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు. జూన్ 29న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.