English | Telugu

'ఏజెంట్' రిజల్ట్ పై అఖిల్ రియాక్షన్

ఇటీవల 'ఏజెంట్' సినిమాతో అఖిల్ అక్కినేని ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మంచి అంచనాలతో ఏప్రిల్‌ 28న విడుదలై మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చి, డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఏజెంట్ ఘోర పరాజయంపై ట్విట్టర్ వేదికగా తాజాగా అఖిల్ స్పందించాడు.

"ఏజెంట్ కోసం అంకిత భావంతో పని చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మేం మంచి చిత్రాన్ని అందించడానికి కృషి చేశాము కానీ అందులో విజయం సాధించలేకపోయాము. నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన ప్రొడ్యూసర్ అనిల్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. అలాగే మా సినిమాని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్ కి, మాకు సపోర్ట్ చేసిన మీడియాకి ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచిన వారందరి కోసం మరింత కష్టపడి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాను" అని అఖిల్ రాసుకొచ్చాడు.

అఖిల్ తన తదుపరి సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నాడు. ఈ సినిమాతో అనిల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.