English | Telugu

బ్రేకింగ్ న్యూస్.. అనిల్ రావిపూడికి మూడు ఫ్యామిలీలు!

"ఇప్పుడొక బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నా.. రాసుకోండి.. నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి" అంటూ 'F3' మూవీ సక్సెస్ మీట్ లో తన స్పీచ్ ని స్టార్ట్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'F3'. దిల్ రాజు ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమా మే 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. " ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను ఇప్పుడు. థంబ్‌నెయిల్స్ వేసుకోండి. నాకు మూడు ఫ్యామిలీలు. మొదటిది నా కుటుంబం. రెండోది F2 కుటుంబం. మూడో ఫ్యామిలీ నేను తీసిన ప్రతి సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులు. F3 కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మా సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రమోషన్ టీమ్ కి స్పెషల్ థాంక్స్. నైజాంలో మూడు రోజుల్లోనే 9.5 లక్షల మంది ఈ సినిమా చూశారు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ పాండెమిక్ తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మనం కోల్పోతూ వస్తున్నాం. సినీ పరిశ్రమ కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు. మళ్ళీ ఆడియన్స్ అందరినీ ఒక్కో సినిమా ద్వారా గెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. కష్టపడుతున్న ప్రతి సినిమా వాళ్ళకి థాంక్స్ అండ్ కంగ్రాట్స్. 'అఖండ' నుంచి మొదలైంది. తర్వాత 'పుష్ప', 'బంగార్రాజు', 'భీమ్లా నాయక్', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2', 'F3'.. ఇలా ప్రతి సినిమా ఎంతోకొంత ఆడియన్స్ ని తీసుకొస్తూ మళ్ళీ థియేటర్స్ కి అలవాటు చేస్తున్నారు. ఇది చాలా అవసరం. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి సినిమా ఆడాలి. ఆడితేనే ఆడియన్స్ థియేటర్స్ కి అలవాటు పడతారు. అన్ని సినిమాలు ఆడి, తెలుగు సినిమాకి పూర్వ వైభవం రావాలని కోరుకుందాం." అని అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.