English | Telugu

నందమూరి తారకరామారావు సినిమా ప్రారంభం..ఎన్టీఆర్ దారినే ఎంచుకున్నాడు

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ 'నందమూరి తారకరామారావు'(Nandamuri taraka ramarao)ముని మనవడు, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)పెద్ద అన్నయ్య జానకిరామ్(Janaki Ram)కుమారుడు తారకరామారావు(Taraka ramarao)హీరోగా అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. వైవిఎస్ చౌదరి(Yvs Chowdary)దర్శకుడు కావడంతో తారకరామారావు చేస్తున్న మొదటి సినిమాపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.

రీసెంట్ గా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ముఖ్య అతిధులుగా నారా భువనేశ్వరి, లోకేశ్వరి, పురందేశ్వరి, రామకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొనగా ముహూర్తం షాట్ కి భువనేశ్వరి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులందరు మాట్లాడుతు తమ నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం హీరో తారకరామారావుని ప్రేక్షకులు ఆదరించాలని, నటనలో తారకరామారావు అత్యున్నత శిఖరాలని అధిరోహించాలని అభిలషించారు.

ఇక వైవీఎస్ చౌదరి మాట్లాడుతు 1980 వ సంవత్సరం నేపధ్యానికి చెందిన కథతో మా చిత్రం తెరకెక్కనుంది. హైందవ సంస్కృతి, తెలుగుభాష గొప్పతనాన్ని చెప్పబోతున్నాం. ఈ నేపధ్యమే అసలైన బలం అని చెప్పుకొచ్చాడు. ప్రముఖ కూచిపూడి డాన్సర్, తెలుగు అమ్మాయి వీణరావు(veena rao)హీరోయిన్ గా చేస్తుండగా బొమ్మరిల్లు సినిమాపై వైవిఎస్ చౌదరి అయన సతీమణి గీత అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...