English | Telugu

కళ్ళుతిరిగిపడిపోయిన విశాల్..కారణం చెప్పి షాక్ ఇచ్చిన డాక్టర్స్ 

విశాల్(Vishal)తన గత చిత్రం 'మదగజరాజ' మూవీ ప్రమోషన్స్ కి హాజరయినప్పుడు రూపురేకలు మొత్తం మారిపోయి వణుకుతు కనిపించాడు. దీంతో విశాల్ ఆరోగ్యంపై రకరకాల వదంతులు వినిపించాయి. అభిమానులైతే తమ హీరోకి ఏమైందంటు ఆందోళన చెందారు. ఖుష్బుతో పాటు ఇతర నటీనటులు కూడా విశాల్ ఆరోగ్యంపై ఆందోళన చెందటంతో పాటు, వైరల్ ఫీవర్ తో విశాల్ బాధపడుతున్నాడని చెప్పారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చు కున్నారు.

కానీ రీసెంట్ గా విశాల్ తమిళనాడులోని విల్లుపురం(Viluppuram)లో నిర్వహించిన ట్రాన్స్ జెండర్ అందాల పోటీలకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఆహ్వానితులు స్టేజ్ పైకి పిలవడంతో తనకి కేటాయించిన ప్లేస్ లో కూర్చున్నాడు. ఆ తర్వాత కాసేపటికే సొమ్మసిల్లి పడిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యి విశాల్ ని దగ్గరలోని ఒక ప్రవైట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. విశాల్ ని పరీక్షించిన వైద్యులు మధ్యాహ్నం పూట ఆహారం తీసుకోకపోవడం వల్లనే నీరసంతో కళ్ళు తిరిగిపడినట్టుగా గుర్తించి, అందుకు సంబంధించిన ట్రీట్ మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేసారు. విశాల్ ఆ తర్వాత యధావిధిగా అందాల పోటీలకి హాజరయ్యాడు.

జరిగిన ఈ మొత్తం సంఘటనపై విశాల్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. విశాల్ ఆరోగ్యం ఉన్నాడని, టైంకి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచించారని ఒక నోట్ ని రిలీజ్ చేసింది. ఇక విశాల్ కళ్ళు తిరిగి పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తు, ఆరోగ్యంపై తమ అభిమాన హీరో శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు. విశాల్ ప్రస్తుతం తుప్పరి వాలన్ పార్ట్ 2 చెయ్యడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కి వెళ్లనుంది. 2017 లో వచ్చిన 'తుప్పరి వాలన్' కి సిక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుండటంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. విశాల్ ప్రస్తుతం నడిగర్ సంఘానికి జనరల్ సెక్రటరీ గా కూడా తన బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.