English | Telugu

బాలయ్య మెచ్చిన 'బింబిసార'.. త్వరలో వశిష్ఠ్ దర్శకత్వంలో సినిమా!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార' ఆగస్టు 5న విడుదలై తొమ్మిది రోజుల్లోనే రూ.28 కోట్లకు పైగా షేర్ రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. మల్లిడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ మొదటి నుంచి ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించి ఘన విజయం సాధించింది. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.

విడుదలకు ముందే 'బింబిసార'ను చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య కూడా బింబిసార టీమ్ ని ప్రశంసించారు. మూవీ టీమ్ తో కలిసి శనివారం సాయంత్రం బాలకృష్ణ మరియు ఇతర నందమూరి కుటుంబసభ్యులు బింబిసారను చూశారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ సినిమా అద్భుతంగా ఉందని, వశిష్ఠ్ చక్కగా తెరకెక్కించాడని కొనియాడారు. ఇలాంటి ప్రతిభ ఉన్న యువత ఇండస్ట్రీలోకి రావాలని, త్వరలోనే మనం కలిసి పనిచేద్దామని వశిష్ఠ్ తో బాలయ్య అన్నారు. కొత్తవారికి అవకాశాలివ్వడంలో నందమూరి కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, ఇలాంటి మంచి చిత్రాలు కళ్యాణ్ రామ్ మరిన్ని చేయాలని బాబాయ్ గా కోరుకుంటున్నట్లు బాలకృష్ణ చెప్పారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.