English | Telugu

హెబ్బా పటేల్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చింది

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వి.వి.వినాయక్ ఆశీస్సులతో గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం 'గీత'. 'మ్యూట్ విట్నెస్' అన్నది ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.

హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. 'నువ్వే కావాలి', 'ప్రేమించువంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు.

ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటన సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... "ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్య గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు.

నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... 'గీత' చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.