English | Telugu

తెలంగాణ స్టాల్ ని ప్రారంభించిన నాగార్జున..అభిమానులకి ఇక పండుగే

సినీనటులతో కలిసి ఇండియా(India)ని ప్రపంచ కేంద్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్(వేవ్) రెండు రోజుల నుంచి ముంబైలో జరుగుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి(Chiranjeevi)రజనీకాంత్(Rajinikanth)నాగార్జున,(Nagarjuna)మోహన్ లాల్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హేమమాలిని, మిథున్ చక్రవర్తి, రాజమౌళి, అలియాభట్, దీపికా పదుకునే, రణబీర్ కపూర్,విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొని పలు విషయాలపై మాట్లాడటం జరిగింది.

'నాగార్జున' ఈ సమ్మిట్ లో తెలంగాణ స్టాల్ ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతు నేటి తరం ప్రేక్షకుల్లో వందలో తొంబై మంది తమ ఒత్తిడిని పోగొట్టుకునేందుకు, తెరపై జరిగే మ్యాజిక్ ని ఇష్టపడుతుంటారు. నేను అదే ఇష్టపడతాను. హీరోలని లార్జర్ దేన్ లైఫ్ రోల్స్ లో చూడాలని కోరుకోవడమే అందుకు కారణం. పుష్ప సిరీస్ తెలుగు కంటే ఇతర భాషల్లో ఎక్కువ కల్లెక్షన్స్ వసూలు చేసింది. కేవలం హీరోల ఎలివేషన్ వరకే కాదు బలమైన కథల వల్ల కూడా ఆ చిత్రాలు విజయాన్ని సాధించాయి. రాజమౌళి బాహుబలిని తెలుగులో తెరకెక్కించినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరించారని చెప్పుకొచ్చాడు.

నాగార్జున సుదీర్ఘ కాలంగా చిత్ర పరిశ్రమలో ఉంటు ఎన్నో హిట్ చిత్రాల ద్వారా అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తున్నాడు. నిర్మాతగాను ఎన్నో విజయవంతమైన చిత్రాలని నిర్మించిన నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్, ధనుష్ తో కలిసి కూలీ(Coolie)కుబేర(Kubera)అనే సినిమాలు చేస్తున్నాడు. ఇండియాలో తెరకెక్కుతున్న అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రాలుగా ఈ రెండు నిలవగా నాగ్ అభిమానులు ఈ రెండు చిత్రాలు ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో వస్తాయా అని ఎదురుచూస్తు ఉన్నారు. కుబేర జూన్ 20 , కూలీ ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్నాయి.


Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...